- నూజివీడు నియోజకవర్గ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
- ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి – ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంటు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బర్మ ఫణి బాబు ఆధ్వర్యంలో ఆవిర్భావం సభకు చెందిన గోడపత్రికలను రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. నూజివీడు నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు ఈ ఆవిర్భావ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ సభ కోసం, పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే సందేశం కోసం రాబోయే కాలానికి ఏరకమైన కార్యాచరణను ప్రకటిస్తారో అని దేశమంతా ఎదురుచూస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 8,9 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి, రాష్ట్రానికి జరిగిన మేలు గురించి, కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులు ఇతర విషయాల గురించి ప్రస్తావనను పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఈ సభకు భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంటు నుండి జనసైనికులు పాల్గొనాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందు వరుసలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో ఐదున్నర కోట్ల మంది స్వాగతిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి, పవన్ కళ్యాణ్ కి మంచి ఆలోచన శక్తిని, జ్ణానాన్ని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వారు సదా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. ద్వారా ఈ సభను దేశమంతా తిలకిస్తుందన్నారు. రాబోయ రోజుల్లో బలమైన శక్తిగా, రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా జనసేనసేన పార్టీ అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బర్మా ఫణి బాబు మాట్లాడుతూ మార్చి 14వ తేదీ పిఠాపురంలోని చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు నూజివీడు నుండి భారీగా తరలిరానున్నామన్నారు. ఈరోజు ఏలూరు పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టర్ను రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని, ఇక్కడకు వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా పండగ వాతావరణంలో అందరూ కలిసే విధంగా ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం, జనసేన శ్రేణులు అందరికీ చాలా శుభ సంతోషకరమన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక జరిగే మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది. ఈ సభకు కార్యకర్తలు, నాయకులు, అందరూ ఆయా గ్రామాల్లో తిరిగి కార్యకర్తలందరినీ సమన్వయపరిచి, 14వ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి రావాలని, ఈ సభ కోసం యావత్ రాష్ట్రం నివురుపోయే వాతావరణంలో ఉండాలని ఈ సభను విజయవంతం చేయాలని బర్మా ఫణి బాబు కోరారు. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకటరావు, బొబ్బిలి శ్రీకాంత్, సూరిశెట్టి శివ, కిరణ్ జనసేన, మత్తి దుర్గా మహేష్, బజారు దుర్గాప్రసాద్, షేక్ ఇమ్రాన్, వీరస్వామి, వీర మహిళలు నిట్ల ఉమామహేశ్వరి, జక్కుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment