జన్మదిన వేడుక కంటే అమరవీరులకు నివాళులు అర్పించడం ముఖ్యం: మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం రూరల్ జనసేన పార్టీ శ్రేణుల మధ్య పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి
జన్మదిన వేడుకలు పిఠాపురం రూరల్ పి.దొంతమూరు జనసైనికుల ఆధ్వార్యంలో ఆర్బాటంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తన జన్మదిన వేడుకులకు ఆనందం వ్యక్తపరచినా 2019-02-14 తేదిన దేశం కోసం అమరవీరులైన వీరజవాన్ లకు నివాళులు అర్పించే కార్యక్రమానికి ప్రధాన్యత చూపించి దేశభక్తి చాటుకున్నారు. ఇదే సందర్బంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… 2019వ సంవత్సరంలో పుల్వామా ఎటాక్ ఉగ్రవాదంలో భారత సైనికులు దుర్మరణం అత్యంత భాదాకరమని ఆ అమరవీరుల మరణానికి నిదర్శనంగా ఫిబ్రవరి 14 బ్లాక్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఈరోజు నా జన్మదినం వాలంటైన్స్ డే జరుపుకొనుటకంటే వీరమరణం చెందిన అమరవీరులకు నివాళులు అర్పించడం ముఖ్యమని ఆమె అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పలికిన మాటవేరు ఇప్పుడు చేస్తున్న పాలన వేరని సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు చేయలేక పోయారని అమ్మఒడి పథకం కింద 15 వేల చొప్పున కుటుంబంలో ఇద్దరికీ వేస్తానని మాట ఇచ్చి ఒకరికే వర్తింప చేయడం మడమ తిప్పే చర్య కాదా అని, ఫీజు రిపోర్సిమోంట్ కూడా సరిగ్గా అమలు కావడంలేదని ఎద్దేవేసారు అలాగే ప్రజలకి రాజధాని ఎక్కడుందని తెలియని పరిస్థితిలో ఉన్నారని వరాలు నవరత్నాలు అంటూ హామీలు ఇచ్చి అమలు చేయడంలో జీరో, ప్రజలను మోసం చేశారు, చెత్త మీద ఇంటి మీద పన్నులతో దోచుకుంటూ ప్రభుత్వ భూములు ఆస్తులు తాకట్టుపెట్టి మీ పరిపాలన అంతా గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని మంచి పరిపాలన రావాలంటే పవన్ రావాలి పాలన మారాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిస్వార్థం వ్యక్తిత్వం కలిగిన వారి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చి పార్టీ పెట్టారని దీనికి అండగా ప్రతి జనసైనికులు భుజాలపై మోస్తూ పార్టీకి అండగా ఉన్న జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కర్రీ హరిబాబు, పులి రమణ, గుడాల విష్ణు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, వెల్దుర్తి వైస్ ప్రెసిడెంట్ హరిబాబు, సి.హెచ్ ధన సి.హెచ్ స్వామి, సి.హెచ్ మధు, కె.సత్య, అశోక్, బి.దొర, జి.రాజు, జి.ఏడుకొండలు, జి దేవి, పి సందీప్. సి.హెచ్ శశి, జి శేఖర్, సుమేలు, సిద్ధా బుజ్జి, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.