నష్టాల పేరుతో స్టీల్ ప్లాంట్ ను ప్రవేటికరించడం తగదు: గూడూరు జనసేన

నష్టాల పేరుతో వైజాగ్ స్టిల్ ప్లాంట్ ను ప్రవేటు పరం చేయడం తగదని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” డిజిటల్ క్యాంపెయింగ్ లో భాగంగా సోమవారం #Raise_Placards_ANDHRA_MP నినాదంతో నెల్లూరు, గూడూరు నియోజవర్గం లో చేపట్టిన కార్యక్రమం గురించి ప్రజలకు తెలియచేయచేయడంతో పలువురు న్యాయవాదులు అలాగే ట్ట్రాన్స్ జండర్స్ మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల పేరుతో విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ ఇస్తామంటే, ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది ఆంధ్రప్రదేశ్ ని అమ్మేస్తారా?? సామాన్యుడు బ్రతకలేని స్థితి లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ని కూడా వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరనకు ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల పై ఉన్న కేసుల మాఫీ గురించి తప్ప వైసీపీ ఎంపీలు రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ, టీడీపీ ఎంపి లు ప్రవేటికరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్ల కార్డులు చూపడంతో పాటుగా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర్, ఓంకార్, మణి, ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.