ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని అనడం సరికాదు: రెడ్డి అప్పలనాయుడు

  • పోలీసులు ఎక్కడ ఉన్నా వారి బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయి.
  • జగన్ పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రెడ్డి అప్పలనాయుడు.
  • పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని మండిపాటు.

ఏలూరు, పోలీసులు ఎప్పుడూ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారే తప్ప చట్టాలని గౌరవించని వారికి సెల్యూట్ చేయరని ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో జగన్ పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలపై రెడ్డి అప్పల నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దిబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పల నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని జగన్ రెడ్డి అనడం సరికాదన్నారు. ఏపీ పోలీసులను కించపరిచేలా జగన్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతారనడం సమంజసమా..?? అని ప్రశ్నించారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినవారే. ఈ విషయాన్ని జగన్ రెడ్డి మరిచిపోయినట్లున్నారు. జగన్ వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అన్నారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసం పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరం. బెదిరింపు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, చట్టాలపై జగన్ కు గౌరవం లేదని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని, అదే పోలీసులను వాడుకొని అక్రమ కేసులు పెట్టించావని గుర్తు చేశారు..కూటమి ప్రభుత్వం వచ్చాకా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లో లా అండ్ ఆర్డర్ చెడగొట్టడమే లక్ష్యంతో జగన్ కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలను మానుకోవాలని వైసీపీ అధిష్టానానికి, జగన్ కు సూచించారు. విజయవాడలో భీభత్సం సృష్టించాలని జగన్ ఆలోచన చేశారు. వల్లభనేని వంశీ రౌడీయిజం, బూతులు గురించి జగన్ కు తెలియదా..?? వంశీ, కొడాలి నాని, అవినాష్ ల దాడులు బూతులను జగన్ ఎందుకు సమర్థించాడు..?? జగన్ ఇకపై నీ ఆటలు సాగవు..?? ప్రజలే నీ సంగతి తేలుస్తారు..?? అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్ళక తప్పదన్నారు.. ఈసారి పులివెందులలో నీ ఓటమి ఖాయం. ఇప్పుడైనా ప్రజలకు మంచి చేసేలా వారికి మేలు జరిగేలా పనిచేయాలని ఆయన సూచించారు.

Share this content:

Post Comment