ఏ ఒక్క జనసైనికుడిని కూడా ఆపడం మీ ప్రభుత్వాల తరంకాదు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట, రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మరియు పరిణామాలు ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందనిపిస్తుంది. కనుక పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. బుధవారం మా పార్టీ నుంచి కూడా మూడురోజుల నుంచి జరుగుతున్న కుట్రను పూర్తిగా చెప్పడం జరిగింది. సోమవారం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సెక్యూరిటీతో గొడవ పడ్డారు అయన ఎక్కడికి వెళ్ళితే అక్కడ అనుసరిస్తున్నారని గమనించి సీసీటీవీ విజువల్ ద్వారా ముగ్గురిని పట్టుకోని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాము ఆయనకు ఏమైనా అయితే ఏ ఒక్క జనసైనికుడిని కూడా ఆపడం మీ ప్రభుత్వాల తరం కాదని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవని తెలియచేస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ వారు తెలంగాణ ప్రభుత్వం వారు త్వరగా విచారించి నిజా నిజాలు తెలియచేయాలిని కోరుకుంటున్నాము. ఆయనను రాజకీయంగా ఎదురుకోలేక ఆయనను చంపడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఇందులో అనుమానించాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ దొరికిన వాహనంలో ఒక్కటి గుజరాత్ కి సంబంధించినది ఇంకొకటి టి ఎస్ 15 ఈక్యు6677 ఏపీ రెడ్డి వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ (ఏపి రెడ్డి వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్) అని ఉంది అంటున్నారు. కాబట్టి గెట్టిగా చెప్తున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మా పవన్ కళ్యాణ్ ఎవడైనా హాని కలిగించాలి అని చూస్తే ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తే లేదు వంగవీటి రంగా రోజులు కావు అని గుర్తుపెట్టుకోవాలి. కాపులకి రాజ్యధికారం రాకుండా ఉండాలి అని మీరు ఎన్ని కుట్రలు పన్నిన కులాల ప్రస్తావన లేని రాజకియం, కులాలను కలిపే అలోచన విధానం ఉన్న మా పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అని కాపులకి రాజ్యధికారం ఆయనతోనే సాధ్యం అని నిరూపిస్తాముని భయపడి పోసుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త కోట్లలో ఉన్న అభిమానుల ఆవేశాని పరీక్షించి కొరివితో తల గోక్కునే సాహసం చేయవద్దు అని కోరుకుంటున్నాము. అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు/జనసైనికులు, వీర మహిళలు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరీ భద్రత యొక్క అవశ్యకతపై దృష్టి పెట్టాలని మన పార్టీకి పొత్తులో ఉన్న బిజేపి అధినాయకత్వం పై ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరీ భద్రత కోసం అందుబాటులో ఉన్న ట్విట్టర్ ద్వారా గాని మెయిల్స్ ద్వారా గాని, ఉత్తర రూపంలో గాని ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంకి తెలియ పరచాలని కోరుకుంటున్నానని ఉమ్మడి కడప జిల్లా జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ వాసు గురివిగారి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన మండల నాయకులు రామ సుబ్బయ్య, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేష్, మారుతీ, ఉపేంద్ర, నరసింహ, హరిష్, ఆవుల సాయి, దాసర గెడ్డ సాయి, మస్తాన్, సుబ్బు, ఈశ్వర్, శివ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.