రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 49వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 42వ డివిజన్లో పర్యటించి అక్కడ మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపన అనంతరం చర్యలు చేపట్టి డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని అందుకు మీరు చేయాల్సిందల్లా ఉమ్మడి కూటమికి ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని రాష్ట్ర ప్రగతి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యమని జగన్ రెడ్డి పరిపాలన రాక్షసత్వాన్ని తలపిస్తోందని అన్ని వర్గాల ప్రజలు వైకాపా ప్రభుత్వ హయాంలో నరక యాతన అనుభవిస్తున్నారని అంటూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.