లంబసింగిలో వర్షంలా కురుస్తున్నమంచు

విశాఖ మన్యం లంబసింగిలో ఆదివారం మంచు వర్షంలా కురిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యటకులు మంచు అందాలకు ముగ్ధులయ్యారు. చింతపల్లిలో ఆదివారం ఉదయం 6.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ విభాగం పరిశోధనా సహాయకురాలు డాక్టర్‌ సౌజన్య తెలిపారు. చలి తీవ్రత పెరగడంతోపాటు మంచు వర్షంలా కురుస్తుండటంతో శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందన్నారు.