ఫ్లైఓవర్ బ్రిడ్జిని వైసీపీ నిర్మించినట్లుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం..

  • అంతపురం నగర ప్రజల ఇక్కట్లు గమనించి త్వరితగతిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

అనంతపురం నియోజకవర్గం: అనంతపురం క్లాక్ టవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని.. వైసీపీ ప్రభుత్వం నిర్మించినట్లుగా ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఏద్దేవా చేసారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావెసంలో కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో నిర్మించిన క్లాక్ టవర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరియు రోడ్డు నిర్మాణ క్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారి ప్రమేయంతో అలైన్మెంట్ మార్చడం వలన నగరంలో నేషనల్ హైవే రోడ్డు అంతా వంకర టింకరగా, అస్తవ్యస్తంగా తయారైంది. నగర ప్రజలు, వాహనదారులు అందరూ ట్రాఫిక్ సమస్య వలన నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి ప్రభుత్వం మరియు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారి అసమర్థత వలన క్లాక్ టవర్ నుంచి కోర్టు రోడ్డు వైపుకు వచ్చే సర్వీస్ రోడ్డు సక్రమంగా వేయనందున.. క్లాక్ టవర్ దగ్గర ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అనంతపురం ఎంపీ గారి ప్రాముఖ్యతను తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఫ్లై ఓవర్ బ్రిడ్జికి అనుసంధానంగా తక్షణమే కోర్టు రోడ్డుకు వచ్చే సర్వీస్ రోడ్డుని పూర్తిస్థాయిలో నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపకపోతే నగర ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని జయరాం రెడ్డి హెచ్చరించారు.