బురద జల్లాలని ప్రయత్నించడం సిగ్గుచేటు: విసినిగిరి శ్రీనివాసరావు

చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జి విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లా పర్యటన సందర్భంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అరకు ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో చిన్న ముసిడివాడ డిజిటల్ అయాన్ జోన్ వద్ద నీట్ ఎగ్జాం రాయడానికి వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ వలన అంతరాయం కలిగి విద్యార్థుల పరీక్షలకు హాజరు కాలేకపోయారని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ, అసలు నిజమేంటో తెలియకుండా అసత్య ప్రచారాలను మా అధినేత పవన్ కళ్యాణ్ పైన చేయడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు. విశాఖ ట్రాఫిక్ అడిషనల్ సీపీ దానిపై సిసి ఫుటేజ్ వీడియోలు బయటపెట్టి అసలు వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలతో మా అధినేతపై లేనిపోని బురద జల్లాలని ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటని, గత ఎలక్షన్లో ప్రజలు రెండు ఒకట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదని ఈసారి ఆ ఒకటి పోయి ఒకటే మిగులుతుందని ఎద్దేవా చేశారు. అలాగే పోలీసులను గుడ్డలూడదీయించి రోడ్లపై పరిగెత్తిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అలాగే ఒకసారి మా పోలీస్ సోదరులందరికీ విజ్ఞప్తి, మీరంతా ఆలోచించి ఆయన బందోబస్తుకు వెళ్ళకుండా స్ట్రైక్ చేస్తే ప్రజలు చేతుల్లో ఎవరికి గుడ్డలూడిపోతాయో బాగా అర్థమవుతుందని తెలిపారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ మరణంపై కూడా శవరాజకీయాలు చేస్తూ కులాలను మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, శవాలపై పేలాలు అమ్ముకునే వారిగా ఈ వైసీపీ నాయకులు తయారయ్యారని, గతంలో వీరు చేసిన అన్యాయాలు అక్రమాలు భూకబ్జాలు ఇసుక మైనింగ్ మాఫియాలు, దౌర్జన్యాలకు, మహిళలను కించపరిచే బూతుల మంత్రులకు, వీరు మద్యం మాఫియాలో వేల కోట్ల అవినీతిలో ఈ దండుపాలెం బ్యాచ్ అంతా జైలు పక్షులు కావడం ఖాయమని హెచ్చరించారు.

Share this content:

Post Comment