పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడం ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత

ఎచ్చెర్ల, రణస్థలం, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అక్కడున్న అన్ని పార్టీల నాయకులు వారి యొక్క పదవులకు రాజీనామాలు చేస్తూ ఉస్మానియా విద్యార్థి విభాగం మేధావులు స్థానిక ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే అంతవరకు నిరంతరం పోరాడుతూనే ఉండి ప్రాణత్యాగాలు చేసుకుంటే గానీ తెలంగాణ రాష్ట్రం అనేది సాధ్యపడలేదు. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కొరకు, విశాఖ రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం కొరకు, రైతులు ధాన్యం కొనుగోలు కోసం, మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే ఒక్క రైతుకు కూడా అర్ధరూపాయి ఇవ్వనటువంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పై ఎవ్వరు కూడా నోరు ఎత్తడం లేదు. కనీసం విద్యార్థులకు ఉద్యోగాలు కూడా లేవు నిత్యం కరెంటు ధరలు పెంచుతూ ఏ వస్తువు కొనాలి అన్న భయపడే అంతగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అటువంటి ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పై ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాంతం కూడా సరైన రోడ్లు లేక గర్భిణీలు ముసలివాళ్ళు ఎంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం పై ప్రజలు పోరాటానికి సిద్ధపడక పోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి అయిపోవడం తద్యం మూడు వేల మంది కౌలు రైతులు మరణిస్తే రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున మూడువేల మందికి 30 కోట్లు పంచడం అనేది చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనాన్ని అర్థం చేసుకుని రానున్న ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి ఓట్లు వేసి జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడం ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత అని జనసేన జానీ తెలియజేయడం జరిగింది.