తెలంగాణ ఎన్నికలకి మేము సైతం అంటూ ముందుకు వచ్చిన యుకే జనసేన

యుకే జనసేన టీం నవంబర్ 25 శనివారం రోజున లండన్ నగరం హౌంస్లౌలో జనసేన తెలంగాణ ఎన్నికల గర్జన మీటప్ నిర్వహించి యుకే మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అవగాహన తీసుకు వచ్చారు. అలాగే 2023 తెలంగాణ ఎన్నికల ప్రత్యేకత జనసేనకు మరియు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంత అవసరమో, వాటి అవశ్యకతను తెలిపారు. అందుకోసం జనసేన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా యుకే ఎన్నారైలు అందరు తెలంగాణలో ఉన్న బందు మిత్రులకి ఫోన్ చేసి మరియు సోషల్ మీడియా లో షేర్ చేసి వారి ఓట్ తెలంగాణలో నవంబర్ 30న తారికున జరుగుతున్న ఎన్నికల బరిలో జనసేన-బీజేపీ పొత్తుతో పాల్గొంటున్న 8 మంది జనసేన మరియు బీజేపీ అస్సెంబ్లీ అభ్యర్థులకి ఓటు వేసి ఆకండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. జనసేన-బీజేపీ పొత్తుతో పాల్గొంటున్న 8 మంది అసెంబ్లీ కంటెస్టెంట్స్ వివరాలు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్(కూకట్పల్లి), నేమూరి శంకర్ గౌడ్ (తాండూర్), ఎం సతీష్ రెడ్డి (కోదాడ), వంగ లక్ష్మణ్ గౌడ్ (నాగర్ కర్నూల్), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), ఎల్.సురేందర్ రావు(కొత్తగూడెం), తేజావత్ సంపత్ నాయక్ (వైరా) మరియు ముయ్యబోయిన ఉమాదేవి(అశ్వారావుపేట). ఈ మీటప్ యుకే జనసేన టీం సహాయ సహకారాలతో నిర్వహించటం జరిగింది. ఈ మీటప్ కు నాగరాజు వడ్రాణం, శంకర్ సిద్ధం, చందు సిద్ధం, శివ కుమార్ మేక, అరుణ్ కుమార్ గంట, బాల నల్లి, పద్మజ రామిశెట్టి, అచ్యుతరాజు కుర్మాపు, అఖిల్ పెండ్యాల, విజయ్ తిరుమలశెట్టి, జోజిబాబు గుబిలి, రామ్ పటేల్, హనీష్ అనుమకొండ, సందీప్, చందాన వాగు, సాయి ప్రసన్న జవ్వాజి, కిరణ్ కాంత్ ఉండి, హారిక ఉండి, హరిత జవ్వాజి, మనోజ్ కుమార్ గయూటీగాయ్, పోతుల సుమన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.