గ్రంథాలయ సదుపాయం కల్పించలేకపోవడం దురదృష్టకరం

చీపురుపల్లి నియోజకవర్గం: నియోజకవర్గంలో పోటీ పరీక్షలకి, గ్రూప్ -2 కి చదివే విద్యార్థులు వందలాది మంది ఉన్నప్పటికీ అదే నియోజకవర్గం నుండి విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ కనీసం లైబ్రరీ సదుపాయం కల్పించలేకపోవడం దురదృష్టకరం. చివరికి విద్యార్థులే ఉన్న చిన్న గదిని వర్షం పడితే నీరు కారేసిన గది పైకప్పు పైన విద్యార్థులే సొంత డబ్బులతో పరదా వేసుకోనే దుస్థితి. చివరికి లైబ్రరీలో కనీసం అవసరమైన పుస్తకాలు కూడా లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం దురదృష్టకరం. దీని మీద చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు లైబ్రరీని పరిశీలించి జనసేన – టిడిపి అధికారంలో వచ్చిన తర్వాత లైబ్రరీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మరియు గ్రంథాలయ కార్యదర్శికి పుస్తకాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గరివిడి మండల అధ్యక్షులు పెద్ది వెంకటేశ్, ఉత్తరాంధ్ర జోన్ కమిటీ సభ్యులు బోడసింగి రామకృష్ణ, కార్యనిర్వాహన నిర్వహణ కార్యదర్శి దన్నన యేసు, చందక బాలకృష్ణ, బాకురి శ్రీను, గిడిజాల చిరంజీవి, పల్లి కూమార్, గొర్ల రమణ తదితరులు పాల్గొన్నారు.