సాధనాల నాగమణికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

అమలాపురం, అమలాపురానికి చెందిన సాధనాల నాగమణి చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని ఒక ప్రైవేట్ సంస్థలో ఆయమ్మగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆర్థిక అవసరాలు రీత్యా సూరపురెడ్డి సురేష్ ని సహాయం కోరగా శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న గనిశెట్టి గంగాజలం మరియు సూర్యనారాయణమ్మ దంపతుల మనవడు చిరంజీవి యోగాన్స్ విరాట్ తల్లిదండ్రుల సహకారంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు చేతుల మీదగా 5000/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు సలాది దొరబాబు, గోకరకొండ లక్ష్మణ్, కరుణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. అందుకు గాను నాగమణి బాబును దీవిస్తూ పని కుటుంబ సభ్యులకు మరియు రాజబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు.