నక్క లోవరాజుకు యాభైవేల ప్రమాద భీమా చెక్కును అందజేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రాయుడుపాలెం ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక సభ్యులు నక్క లోవరాజు లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రమాద భీమా వైద్యఖర్చుల నిమిత్తంలో భాగంగా రూపాయలు 50000/- చెక్ రాష్ట్ర పార్టీ కార్యాలయం వారు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి పంపించడం జరిగింది. శుక్రవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ రాయుడుపాలెంలోని లోవరాజు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చెక్ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.