జాతీయ జెండాను ఆవిష్కరించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కాకినాడ రూరల్ జనసేన కార్యాలయం వద్ద 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయం వద్ద జాతీయ జెండాను పంతం నానాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసైనికులు నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.