చీరా సారే తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరిన జనసేన వీర మహిళలు

తిరుపతి, వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వక, మధ్య నిషేధం చేస్తానని, మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఉదంతం ఇలా ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని. అమలు చేయక రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమాలు పూర్తిచేశామంటూ మసి పూసి మారేడు కాయ చేసినట్లు భ్రమలు కల్పించే సీఎం జగన్ ముఖ్యమంత్రిగా అనర్హుడని సీఎంకు తాము చీర, సారే పెట్టడానికి వచ్చామని జగన్ వీటిని అందుకోవాలని. జనసేన వీర మహిళలు ప్రెస్ క్లబ్లో శుక్రవారం వెల్లడించారు. వీర మహిళలు ఆకే పార్టీ సుభాషిని, లక్ష్మీ, దుర్గా, లావణ్య, చందన తదితర సమూహంతో విచ్చేసిన ఈ వనితలు మాట్లాడుతూ తమ జనసేనాని పవన్ కళ్యాణ్ ను పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ప్రస్తావించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గాని కుటుంబానికి సంబంధించిన విమర్శలు చేయడం తగదని దుయ్యబట్టారు. ఒకరిని అనే ముందు మన ఇంట్లో తాతకు, చెల్లెకు ఎన్ని పెళ్లిళ్లు ఒకసారి చూసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.