కటారి అయ్యప్పకు మనోధైర్యాన్నిచ్చిన యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం గ్రామం జనసైనికులు కటారి అయ్యప్ప ఇటీవల పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకుని కటారి అయ్యప్పను పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించి 5,000/- రూపాయల ఆర్ధికసాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.