పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డ పెనుకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ కుమార్
ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద బుధవారం పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని పెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నామని, ప్రజలు భారీ మెజార్టీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు వార్డ్ మెంబర్ కి ఎక్కువ సర్పంచు కు తక్కువ అని అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పార్టీలో ఉన్న ఒక్కొక్కరు బయటికి వెళ్తుంటే మతిభ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వేరే వాళ్ళ పార్టీని లాక్కొని అధ్యక్షుడినని చెప్పుకునే మీలాంటి వారా పవన్ కళ్యాణ్ ని విమర్శించేది అని, పెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నామని, ఇలాంటి మాటలే మాట్లాడితే 150 నుంచి 11 కి వచ్చారు 11 నుంచి చివరికి మీరు కూడా అసెంబ్లీకి రాని విధంగా ప్రజలు బుద్ది చెప్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాగో అసెంబ్లీకి రారు. తర్వాత ఇంకా ఓటమితో ఇంట్లో ఉంటారు. గుర్తుపెట్టుకుని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. మీరు ఎక్కడో లోటస్ పాండ్ లో రెస్ట్ తీసుకుంటే రాష్ట్రానికి మేలు. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల శ్రేయసుని కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, సోమందేపల్లి మండల కన్వీనర్ జాబిఉల్లా, నియోజకవర్గ నాయకులు రాజేష్ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్ యువ నాయకులు హరి నాయక్, రవి, గంగాధర్, ఖాసీం, రమేష్, సోమందేపల్లి వెంకటేష్, మంజునాథ్ వీర మహిళలు శిరీష మరియు సుమిత్ర రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment