మంగళవారం, లాడ్జి సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజీనామ చేసిన గుంటూరు నగర మేయర్ రాజీనామా చేసి వెళ్లిపోయేటప్పుడైనా హుందాగా ప్రవర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రోటోకాల్, అవమానాల సంగతి మాట్లాడుతున్నారని అధికారం తలకే నెత్తికెక్కించుకొని రోడ్లమీద ఎమ్మెల్యేలతో కర్రలు పట్టుకుని తిరిగినప్పుడు ప్రోటోకాల్ గుర్తు రాలేదా అని చెప్పి అన్నారు. అధికారంలో ఉన్న రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మీడియా ముందు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో గుంటూరు నగరాన్ని దోచుకోవడమే సరిపోయిందని, ఇక మీద అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామని తెలియజేశారు. రాబోయే ఈ సంవత్సరకాలంలో నాలుగు సంవత్సరాలలో జరగని అభివృద్ధిని చేసుకుంటూ గుంటూరు నగరాన్ని పూర్తి స్దాయి లో అభివృద్ధి చేస్తామని అన్నారు. మేయర్ అభ్యర్థి ఎవరు అనేది త్వరలోనే కూటమి పార్టీలన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని తెలియజేస్తామని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ తీరు ఇంకా మారలేదని, అసెంబ్లీలో వారు వహిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యం పట్ల వారికున్న ఆశ్రద్ధతను తెలియ చేస్తుంది అన్నారు. అలాగే పెద్దల సభలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడే 11 సీట్లు పరిమితమయ్యారని, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇప్పటికైనా సమస్యల మీద చర్చిస్తే బాగుంటుందని హితువు పలికారు. బొత్స సత్యనారాయణ వైసీపీకి కొత్త అధ్యక్షులు లాగా మాట్లాడుతున్నారని, అలా అయినా మగ ఇబ్బంది లేదని ఆ విషయాన్ని కూడా స్వాగతిస్తామని తెలియజేశారు. అలాగే కూటమి పార్టీలన్నీ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని మేయరు మరియు డిప్యూటీ మేయర్ అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలియజేశారు. ఇప్పటివరకు వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వస్తున్నావని ఊహాగానాలే అని తెలియజేశారు. నిర్ణయం తీసుకున్నాక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
అలాగే సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు మాట్లాడుతూ గతంలో నగర ప్రథమ పౌరుడు స్థానంలో ఉన్న వ్యక్తి నా కార్పొరేటర్లు నాకు సహకరించడం లేదు అని చెప్పడం వారి పరిపాలన దక్షతకు అద్దం పడుతుందని అని అన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. పత్రికా సమావేశ అనంతరం గుంటూరు నగర కార్పొరేషన్ లో జరుగుతున్న పరిణామాలపై ఈరోజు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన ముఖ్య నాయకులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య, రాష్ట్ర కార్యదర్శి నయుబ్ కమల్ గారు మరియు జనసేన పార్టీ కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికలపై సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, ప్రత్తిపాడు పి.ఓ.సి కొర్రపాటి నాగేశ్వరావు, వట్టిచెరుకూరు మండలం అధ్యక్షులు పత్తి భవనారాయణ, తారక బాబు, గోపిశెట్టి సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment