తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఢిల్లీకి వెళ్లిన ఈటల..

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. రేపు ఈటల బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు. ఈ క్రమంలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బండి సంజయ్.. ఈటలను పార్టీ అగ్రనేతల వద్దకు స్వయంగా తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇటీవల భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ సొంతపార్టీ పెడతారా? లేక ఇతర పార్టీల్లో చేరతారా? అని ఇటీవలి వరకు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో కొద్దిమేర స్పష్టత వచ్చింది.