దళితుడు మనోజ్ కుమార్ కి అండగా జడ శ్రావణ్ కుమార్

కొండెపి నియోజకవర్గం: మాజీ న్యాయమూర్తి, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ ను సోమవారం విజయవాడలో దళితుడు కనపర్తి మనోజ్ కుమార్ కలవడం జరిగింది. మనోజ్ కుమార్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. తప్పు చేసినటువంటి పెంట్యాల కృష్ణబాబుకి కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తాను, అదేవిధంగా మనోజ్ కుమార్ కి అండగా ఉంటానని జడ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ట్రాసిటీ కేసుకు సంబంధించి కనిగిరి డి.ఎస్.పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అపరిచితుడు చిత్రంలో హీరో మూడు విభిన్న పాత్రలు పోషించినట్టుగా, నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం, బడేవారిపాలెం గ్రామానికి చెందిన పెంట్యాల కృష్ణబాబు కూడా అదే తరహాలో నిజజీవితంలో కేసుకు సంబంధించి మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఒక పక్కన రెక్కి నిర్వహిస్తూ మనోజ్ కుమార్ ని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకో పక్కన రాజకీయ పలుకుబడి ఉన్న పెద్దల ద్వారా కేసు రాజీ చేసుకోవాలి అంటూ ఒత్తుడులు తీసుకొని వస్తున్నాడు, మరొక పక్కన పెంట్యాల కృష్ణబాబు యొక్క అనుచరులను మనోజ్ కుమార్ వద్దకు పంపించి, కృష్ణబాబుకి 10 కోట్లు వరకు అప్పు ఉంది, ప్రాణాంతకమైన వ్యాధి ఉంది, పైగా అట్రాసిటీ కేసు ఉంది, ఈ మూడు సమస్యల వల్ల ఎవరికి చెప్పుకోలేని బాధని అనుభవిస్తూ సతమతమైపోతున్నాడు, 10 లక్షలు డబ్బులు ఇస్తాము కేసు రాజీ చేసుకో లేకపోతే చంపేస్తామంటూ మనోజ్ కుమార్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డి.ఎస్.పి దగ్గర న్యాయం జరగకపోతే ఎస్.పి మరియు డి.జి. పి గారిని కలుస్తాను అని మనోజ్ కుమార్ మీడియాకి తెలియజేశారు.