తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన జగన్‌

పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా సంకల్‌బాగ్‌ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలో సీఎం పాల్గొన్నారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించి…నదికి హారతినిచ్చి పుష్కరుడిని ఆహ్వానించారు.

ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గా్ల్లో కలిపి 23 పుష్కరఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. పుష్కరాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రధాన ఘాట్లలో సాయంత్రం గంగా హారతి ఉంటుందన్నారు. సంకల్‌బాట్‌ ఘాట్‌లో 12 రోజులపాటు నిత్య హోమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.