జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త..!!

•తిరుపతి జనసేన వినూత్న నిరసన

తిరుపతి, సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి విచ్చేయుచున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ ముఖ్య నాయకులతో కలిసి వినూత్న నిరసన ఆదివారం స్థానిక బైరాగి పట్టెడ పార్క్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతికి విచ్చేస్తున్నారు కనుక సీఎం కాన్వాయ్ కి సంబంధించి ఏ ఒక్క ట్రాన్స్ పోర్ట్ వారు కూడా అందుబాటులో లేరు, ఎందుకనగా ఇప్పటికే ట్రావెల్స్ వారికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నందువలన ఎవ్వరు కూడా కార్లు పెట్టుటకు సుముఖంగా లేరు కాబట్టి తిరుపతి స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్న భక్తులు మీ కార్లను జాగ్రత్తగా ఉంచుకో వలసినదిగా దండోరా వేసి మరీ మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, మునస్వామి, ముక్కు సత్యవంతుడు, సుభాషిని, కీర్తన, కోకిల, మనోజ్, బలరాం, రమేష్, రాజశేఖర్, లోకేష్, హేమంత్, కిషోర్, బాలాజీ, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.