సిమ్లా చేరుకున్న జగన్.. సిల్వర్ జూబ్లీ వివాహవార్షికోత్సం అక్కడే!

ఉత్తర భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్ సిమ్లా చేరుకున్నారు. నిన్న విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్ చేరుకున్న జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిమ్లా వెళ్లారు. జగన్ దంపతులు రేపు తమ సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలను సిమ్లాలోనే జరుపుకోనున్నారు. పర్యటన ముగించుకుని ఈ నెల 30 లేదంటే 31న తిరిగి జగన్ విజయవాడ చేరుకుంటారు.