సత్యవేడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని సత్యవేడు జనసేన మండలాధ్యక్షుడు రూపేష్ కుమార్ తెలిపారు. శనివారం సత్యవేడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఒక స్థానం నుంచి 21 స్థానాలకు ఎదిగిన పవన్ కళ్యాణ్ ను 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిన జగన్ విమర్శించడం తగదని” అన్నారు. జగన్ గురించి రాష్ట్ర ప్రజలు “పరదాలకు ఎక్కువ పరిపాలనకు తక్కువ” అని, “కోడి కత్తి ఎక్కువ, గొడ్డలి పోటు తక్కువ” అని ఎద్దేవా చేస్తున్నారని రూపేష్ కుమార్ వ్యాఖ్యానించారు. తదుపరి, “తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్ లతో కబుర్లు చెప్పడం మానుకుని అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని” జగన్ ను సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షుడు హేమంత్ కుమార్, నాయకులు కుమార్, అనిల్ కుమార్, ధనుష్, శ్రీను, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment