జగన్ కి ప్రజల గుండెల్లో చోటులేదు

  • స్టిక్కర్ల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా
  • నమ్మకం లేకే నన్ను నమ్మండి నన్ను నమ్మండి అంటూ వేడుకోలు
  • వైసీపీ అసమర్ధ పాలనతో ప్రతీ కుటుంభం కష్టాలతో సంసారం చేయాల్సిన దుస్థితి నెలకొంది
  • బెయిల్ రద్దు అయితే జగన్ భవిష్యత్ ఏమిటో ఆయనకే తెలియదు. మాకు నువ్వెలా భవిష్యత్ అవుతావు అంటున్న ప్రజలు
  • ఒక్క చాన్స్ ఇచ్చి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు
  • వైసీపీ పాలన అంతం కోసం వేయి కళ్లతో ప్రజలు ఎదురుచూస్తున్నారు
  • ఎన్ని మాయమాటలు, ఇంకెన్ని సానుభూతి వచనాలు చెప్పినా, ఎన్ని స్టిక్కర్లు అతికించినా 2024 లో వైసీపీ నేతలకు శంకరగిరి మాన్యాలు తప్పవు
  • నీతో భవిష్యత్ లేదు…నీపై నమ్మకమూ లేదు స్టిక్కర్లను విడుదల చేసిన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

గుంటూరు, నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన జగన్ కు ప్రజల గుండెల్లో స్థానం లేదని, అందుకే ఇప్పుడు ఇంటి గోడల మీదకి చేరాడని, రానున్న రోజుల్లో చెత్తకుప్పల్లోకి చేర్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం శ్రీనివాసరావుతోటలోని పీర్లచావిడి సెంటర్లో జగనన్నో నీతో భవిష్యత్ లేదు – నీపై నమ్మకమూ లేదు అంటూ స్టిక్కర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో స్టిక్కర్ల పేరుతో నన్ను నమ్మండి నన్ను నమ్మండి అంటూ జగన్ ప్రజల్ని వేడుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా జగన్ పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ పేరు చెబితేనే చీదరించుకుంటున్నారని, స్టిక్కర్లు అతికించినా, గోడలకు సున్నాలు వేసినా వైసీపీని నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. స్టిక్కర్లు వేసేముందు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. రాజధాని నిర్మించి, పోలవరం కట్టి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి, దశలవారీ మద్యనిషేదం విధించి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించి, దళితులపై జరుగుతున్న హత్యలను, ఆడపిల్లలపై జరుగుతున్న హత్యాచారాలను నిలువరించి, గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను అరికట్టి, సీపీయస్ రద్దుచేసి, చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించి, సామాజిక కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, దెబ్బతిన్న రోడ్లను నిర్మించి, పెంచిన విద్యుత్, బస్ చార్జీలు తగ్గించి, చెత్త పన్ను ఎత్తివేసి ఇలా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాకే స్టిక్కర్లను అతికించాలన్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికే ప్రజల జీవితాలు నరకప్రాయకంగా మారాయని, ఏ ముఖం పెట్టుకొని మరో చాన్స్ అడుగుతారంటూ ఆయన మండిపడ్డారు. మరొఛాన్స్ వైసీపీకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఖాళీ అయిపోతుందని, ప్రజలెవరూ రాష్ట్రంలో ఉండరని వలసలు వెళ్లిపోతారన్నారు. వైసీపీ పాలనలో దగా పడని, బాధపడని కుటుంభం రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదని ధ్వజమెత్తారు. అసలు జగన్ భవిష్యత్ కోర్టులో ఉందని అలాంటి వ్యక్తి ప్రజల భవిష్యత్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. వైసీపీ పాలన ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తునారన్నారు. వైసీపీ నేతలు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని సానుభూతి వచనాలు పలికినా, ఇంటి ముందుకొచ్చి ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని జోస్యం చెప్పారు. ఉన్న కాస్త సమయంలో అయినా స్టిక్కర్లు, రంగులు అంటూ ప్రజాధనాన్ని వృధా చేయవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బండారు రవీంద్ర, రామిశెట్టి శ్రీను, బాషా, కోనేటి ప్రసాద్, ఉదయ్, టార్జాన్, నండూరి స్వామి, బద్రిశెట్టి రాంబాబు, రెల్లి రాష్ట్ర యువనేత సోమి ఉదయ్, చిన్న, బాలాజీ, వడ్డె సుబ్బారావు, అలీ తదితరులు పాల్గొన్నారు.