- జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు
నెల్లూరు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు విమర్శించారు. గురువారం నగరంలోని మాగుంట లే అవుట్ లో ఉన్న జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నేను బ్రతికే ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో జగన్ తప్ప ఎవరికీ లేదన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్ కి 11 సీట్లు ఇచ్చినా అతనిలో ఇంకా మార్పు రాలేదని అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదన్నారు.
Share this content:
Post Comment