జగన్ ది అంతా రాజకీయ ఉన్మాదమే!

*గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ

గుంతకల్ పట్టణం, కసాపురం రోడ్డు స్థానిక వాసగిరి మణికంఠ జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జనసేన శ్రేణులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయాలంటే ప్రజల కోసం పని చేస్తూ ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు అండగా ఉండాలి, వారి బతుకులకు భరోసా, భద్రతను ఇవ్వాలి. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు, ఉన్నత స్థానంలో పనిచేసిన వాళ్లు మరింత బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలి. జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య కారు కింద పడిన పట్టించుకోలేదు.. స్వయానా వాహనంపై ఉండి ఘటన తెలిసి కూడా జగన్ కారు దిగి స్పందించలేదు. ప్రమాదంలో కార్యకర్త చనిపోయాడని తెలిసి కనీసం మానవత్వం చూపలేదు. తన పర్యటనలో తన నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చనిపోతే.. కనీసం జగన్ సంతాపం తెలుపలేదు. పరామర్శ చేయలేదు. బెట్టింగు, బ్లేడ్ బ్యాచ్ ల పరామర్శకు యాత్రలు చేసిన జగన్. తన కారణంగా సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం స్పందించలేదు. ఇదేనా మానవత్వం?. పైగా కనికరం లేకుండా ముళ్ళ పొదల్లోకి లాగి పడేసి నవ్వుకుంటూ జేజేలు కొట్టించుకుంటూ వెళ్లిపోయాడు.. మీరు అసలు మనిషివేనా జగన్ రెడ్డి ? ఇలాంటి వాళ్లు రాజకీయాలకు అర్హులా? ప్రజలే నిర్ణయించుకోవాలి.. తన ప్రచార మోజులో తన కారుతో ఒక దళితుడి తలను తొక్కుకుంటూ నిర్ధాక్షణంగా జరిగిన ఘటనపై స్పందించని ఘోరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆ వృద్ధుడు బ్రతికేవాడు.. ఇది జగన్ చేసిన హత్య కాక మరేమిటి? ఒక మాజీ సీఎం రఫా, రఫా నరికేస్తాం అన్న మాటలను సమర్థిస్తారా? పైగా వారు చెప్పింది తప్పు కాదు అంటారా? క్రూరత్వం తప్ప జగన్ లో మానవత్వం లేదు. విద్వేషం, విధ్వంసమే అజెండాగా పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిర్ణయాత్మకంగా ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలే ఇవ్వాలి తప్ప ఉన్మాద చర్యలకు పాల్పడకూడదని ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి పని చేసే వాడే నిజమైన నాయకుడు అని అలాంటి ఆలోచన విధానంతోనే మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారన్నారు. భరతజాతి ముద్దుబిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్భుత సహకారంతో 2024 స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సారధ్యంలో స్థానికంగా గుంతకల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ప్రోత్బలంతో ప్రజలందరి ఆశీర్వాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు బండి శేఖర్ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ పవర్ శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ నియోజకవర్గం సీనియర్ నాయకుల బోయగడ్డ బ్రహ్మయ్య, ఆటో రామకృష్ణ, కోటేశ్వరరావు, గాజుల రాఘవేంద్ర, ఆఖండ్ భాష, అశ్వ నాగప్ప, ఓబులేసు, దాదు, విజయ్ కుమార్, అమర్, నాగేంద్ర, అనిల్, షమ్మీ, ఈరన్న, శ్రీకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment