తిరుపతి, బుధవారం జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతూ.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని తిరుపతిలో గురువారం వీరమహిళలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటలు కుళాయిల వద్ద మహిళలు మాట్లాడేలా ఉన్నాయని, మా అధినేత పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్ కు తక్కువ అనడం చూస్తుంటే జగన్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చంచలగూడకి ఎక్కువ.. అండమాన్ కి తక్కువని, ఉప్పల్ బాలుకి ఎక్కువ.. కే.ఏ పాల్ కు తక్కువని, శ్రీ రెడ్డికి ఎక్కువ.. రోజా రెడ్డికి తక్కువ అని జగన్ పై ఆమె మండిపడ్డారు. మీ నాన్న అనే పేరు లేకపోతే నువ్వు బఠానీలు అమ్ముకునే దానికి కూడా పనికి రావని, జగన్ కి ఉన్న 11 మందిని తీసుకొని ముందు అసెంబ్లీకి వచ్చి అక్కడ మీ ఏడుపులు ఏడవాలన్నారు. మరొకసారి మా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే గాలిలో కలిసి పోతావని, ఒకసారి పాతాళానికి తొక్కుతానని చెప్పి మిమ్మల్ని 11 మందికి పరిమితం చేసిన విషయం ఆమె గుర్తు చేశారు. ఇలానే మాట్లాడితే ఈసారి మా అధినేత మీకు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారని అమే జోస్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో.. వంశీ, దుర్గ, మధులత, జయంతి, శిరీష, శాంతీ, ఆది తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment