శ్రీకాళహస్తిలో 10 తలల రావణాసురుడిగా జగన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

  • ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నిరసన తెలిపే హక్కులను కాలరాస్తున్నారు

శ్రీకాళహస్తి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ముసుగులో మంగళవారం వైసీపీ కార్యకర్తలు దగ్ధం చెయ్యడాన్ని నిరసిస్తూ బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద జగన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చెయ్యడానికి వెళ్తుండగా పోలీస్ లు ప్రివెంటివ్ అరెస్టు పేరుతో హౌస్ అరెస్టు చెయ్యడం జరిగింది. మంగళవారం పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చెయ్యడానికి అనుమతించిన పోలీసులు జనసేన కార్యక్రమానికి ఆటంకాలు పెట్టడం, అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నిరసన తెలిపే హక్కులను కాలరాయమే. శాంతియుతంగా రాజ్యాంగ బద్దంగా నిరసన తెలపడం పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య. స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బర్త్ డే పార్టీ చేసుకోవడానికి ఇచ్చిన పెర్మిషన్, జనసేన పార్టీ నిరసన తెలపడానికి ఎందుకు ఇవ్వరు. వినుత ఇంటి కాంపౌండ్ లోపలకి పోలీసులు బలవంతంగా వచ్చి పార్టీ కార్యకర్తల ఆధార్కార్డులు చూపాలని అడగడం వింత పోకడ. పోలీసులు హౌజ్ అరెస్టు చేయడంతో వినుత ఇంటి వద్ద జగన్ రెడ్డి 10 తలలతో రావణాసురుడి ఆకారంలో చేసి దిష్టి బొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్ళిమండపం వద్దకు నిరసన చెయ్యడానికి చేరుకున్న కొంత పార్టీ నాయకులు కొట్టే సాయి ప్రసాద్ ను, జనసైనికులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడానికి వినుత తీవ్రంగా ఖండించారు.