విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనం జగన్ రెడ్డి

  • రాజధాని అమరావతిపై విషం కక్కి నేటికి నాలుగేళ్ళు
  • అధికార మార్పుతో వచ్చే సంవత్సరానికి నవ నిర్మాణాలతో రాజధాని నిర్మాణం
  • ఎన్ని కష్టాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతుల వెన్నంటే ఉంటామంటూ ప్రకటించిన గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: మాయ మాటలతో, అబద్ధపు హామీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తన నిజస్వరూపారాన్ని బయటపెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంగా మార్చారని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. విశ్వాసఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా జగన్ రెడ్డి వినుతికెక్కాడని విమర్శించారు. రాజధాని ఉద్యమం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కలక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రైతులకు అండగా ఉంటామంటూ టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ రాజధాని అమరావతి చరిత్రలో 2019 డిసెంబర్17 చీకటి రోజన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని అధికారంలోకి రాగానే అమరావతి పై విషం కక్కిన నమ్మకద్రోహి జగన్ అంటూ విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి తన ఇల్లు కూడా రాజధానిలోనే కట్టుకుంటున్నారు అంటూ నమ్మించి వంచించిన నయవంచకులు వైసీపీ నేతలంటూ దుయ్యబట్టారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతుల త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడటం వైసీపీ నేతలకు తగదన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ మూడు రాజధానులంటూ తన కపట నాటకాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి బయటపెట్టి నాలుగేళ్లు దాటిందని విమర్శించారు. అమరావతి రైతుల గుండెకోత నుంచి పుట్టిందే రాజధాని రైతుల ఉద్యమమన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ రెడ్డి అనుసరించని దాష్టీకాలు లేవన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని చూసారన్నారు. మహిళ రైతులని కూడా చూడకుండా కాళ్లతో తన్నించి ఆనందపడ్డ పెద్ద శాడిస్ట్ జగన్ అంటూ ధ్వజమెత్తారు. 144 సెక్షన్, 30 యాక్ట్ ల పేరుతో రైతులపై వందల కేసులు పెట్టించిన దుర్మార్గులు వైసీపీ నేతలంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు. టీడీపీ, జనసేన నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో వచ్చే సంవత్సరం ఈ సమయానికి రాజధాని నవ నిర్మాణాలతో వెలుగొందుతోందని ఆశాభావాన్ని ఆళ్ళ హరి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరమహిళ అనసూయ నగర కమిటీ సభ్యులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, పులిగడ్డ గోపి, బందెల నవీన్, రాధాకృష్ణ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, దుర్గాప్రసాద్, కోలా అంజి టీడీపీ నేతలు నైజామ్ బాబు, బియ్యం శ్రీను, జిలా, కోలా మల్లి, సుందరరావు, అంజి, మిద్దె నాగరాజు, గుర్రాల ఉమ, నండూరి స్వామి, తాడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.