ముస్లిం మైనారీలను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నమ్మక ద్రోహి

మదనపల్లె: ముస్లిం మైనారీలను నట్టేట ముంచిన నమ్మక ద్రోహి జగన్ రెడ్డి ఎందుకంటే.. ఎన్నికల ముందు ముస్లిమ్ మైనారిటీ లకి తాను అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తానని హామీలు కురిపించి.. అనంతరం వారిని నట్టేట ముంచారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, కార్యదర్శి సనావుల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జగన్‌ ప్రభుత్వంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలపై జనసేన పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లిన మైనారిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోగా.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పథకం గురించి పట్టించుకోలేదన్నారు. దుల్హన్‌ పథకాన్ని పూర్తిగా మరిచిపోయారని.. ఉర్దూ భాషాభివృద్ధికి పాటుపడుతున్న ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు జీతాలు, ఉర్దూ లైబ్రరీలకు అద్దెలు చెల్లించడం లేదన్నారు. అన్ని రంగాల్లో మైనారిటీలకు తీరని అన్యాయం చేస్తున్న జగన్‌కు అల్విదా చెప్పేందుకు మైనారిటీలు సిద్ధంగా ఉన్నారని.. రానున్న రెండేళ్లలోనైనా ఆయన తీరు మారకపోతే ఆయన మైనారిటీ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. రాష్ట్రంలో రికార్డులు బ్రేక్‌ చేసేలా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. యువత సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తాము అని చెప్పి.. మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి నాడు దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు ఇస్తుంటే.. తాను రూ.లక్ష ఇస్తానని చెప్పిన సీఎం మోసం చేశారని విమర్శించారు. ముస్లిమ్స్ కి ప్రత్యేక బ్యాంక్ పెడతానని చెప్పిన జగన్ రెడ్డి.. మౌల్వీలకి, ఇమామలకి ఇల్లు కట్టి ఇస్తాము అని.. ఒక్కరికి కూడా ఇల్లు కట్టి ఇవ్వలేదు.. నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీలకు ఇవ్వలేదని.. దీనిని బట్టే జగన్మోహన్‌రెడ్డికి ముస్లింలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ ప్రదాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, ముస్లిం మైనారిటీలు ఖాలీల్, ఆలీ, సాబు, అంజాద్, చాంద్ బాషా, రెడ్డి బాషా, నవాజ్, సాదిక్, ధనుష్, రామసముద్రం మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, మదనపల్లె రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, జనసేన పార్టీ యువనాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.