పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారా..?

  • జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం : జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ బుధవారం పత్తికొండ జనసేన కార్యాలయంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పాలసీల గురించి మాట్లాడలేని చాతకాని చచ్చు వెదవలను ఎన్నుకున్న ప్రజలకు వందనం.. 11 రోజులుగా పవన్ కళ్యాణ్ అన్న గారు ఎక్కిన వాహనం వరాహి కాదు వారాహి. నువ్వు ఎంత మతమార్పిడి కుటుంబంలో పుట్టినా.. కొంచెం పాలిస్తున్న ప్రజలు కొలిచే దేవుళ్ళ పేరు తెలుసుకో.. మాట్లాడితే పెళ్ళిళ్ళు అనే మాట తప్ప నాలుగున్నర సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రగతి గురించి చెప్పడం రాదు. పెళ్లిళ్ల గురించి మాట్లాడుదాం అంటే చదువుకున్న చదువు, గురువులు నేర్పిన సంస్కారం ముందు ఒక వ్యక్తిని తిట్టాలి అంటే ఇంట్లో ఆడపడుచును మాట అనాల్సివస్తుంది అని నా నోటిని అదుపు చేసుకుంటున్నాము. మీరు పవన్ కళ్యాణ్ అన్న గారి పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు నీ తాత, నీ బాబాయ్, నీ చెల్లెలు గురించి మాకు మాట్లాడటం మొదలుపెడతాము. అవును పవన్ కళ్యాణ్ అన్న గారు అవేశంతో ఊగిపోయే మాట్లాడుతాడు. ఎందుకంటే ప్రజా సమస్యను తన స్వంత సమస్యగా భావిస్తే ఆవేశమే వస్తుంది. ఐనా మీరు మాట్లాడాలంటే ముందు సరైన తెలుగు రాదు. సమస్య నీది అనే భావన లేదు కనుక ముఖ కవలికల్లో దొరికితేనే నువ్వు మాట్లాడితే 10సెకండ్లకొకసారి పేపర్ చుసుకొకపోతే ఫ్లో పోతది. జగన్ మోహన్ రెడ్డి అను నువ్వు నిజాయితీ పరుడివి ఐతే పాలసీలతో సమాధానం చెప్పడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేస్తాం. వచ్చి రుజువులు చూపించి నీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని రుజువు చెయ్యి.. ఐనా మీ 60:40 విషయం చెబుతాను. చంద్రబాబు నాయుడు పాలించిన 5 సంవత్సర కాలంలో నువ్వు పాలించిన 4 1/2 సంవత్సరంలో ఒకరి మీద ఒకరు ఇంతవరకూ ఒక ఆరోపణనూ నిరుపించలేదు అంటేనే మీ బంధం అర్దం అవుతుంది. ముఖ్యమంత్రి స్థాయి మరిచి నీ దిగజారుడు మాటను నేను ఖండిస్తున్నా. నువ్వు పాలించిన 4 1/2 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఏమి అభివృద్ధి చేసావో చెప్పు అని జనసేనాని అడిగితే.. పెళ్లిళ్లు టాపిక్ తీసుకొస్తావు. ప్రత్యేక హోదా సాధించలేదు, పరిశ్రమలు తీసుకు రావడం లేదు, పోలవరం పూర్తి చేయలేదు, రాజధాని నిర్మాణం చేపట్టలేదు, రోడ్లు బాగు చేయడం లేదు, మద్య నిషేధం అమలు చేయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఉద్యోగాల భర్తీ చేయడం లేదు, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు, నిరుద్యోగ భృతి చెల్లించడం లేదు,
ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు, రైతుల్ని నిలువునా ముంచేయడం మానలేదు, అంబేద్కర్ విదేశీ విద్య అమలు చేయడంలేదు, దళితుల్ని, మైనారిటీలను మోసం చేయడం మానలేదు, కాపుల్ని, బిసిలని కించపరచడం మానలేదు,
దుల్హన్ పథకం అమలు చేయడం లేదు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడం లేదు,
గంజాయి సాగుకి అడ్డు చెప్పలేదు, ధరలు, కరెంట్ బిల్లులు పెంచడం మానలేదు,
హత్యలు, అత్యాచారాలు ఆపడం లేదు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానలేదు, భూముల కబ్జాలు చేయడం ఆపలేదు, ప్రతీ వారం అప్పులు చేయడం ఆపలేదు, దోచుకోవడం, దాచుకోవడంలో తగ్గడం లేదు, ఇసుక, ఎర్రచందనం మాయం చేయడం మానలేదు, కోర్టు వాయిదాలు ఎగ్గొట్టడం మానలేదు, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సిగ్గు పడడం లేదు, వెళ్ళినప్పుడల్లా ఢిల్లీ పెద్దల కాళ్ళు నొక్కడం ఆపలేదు అంతేకదా.. పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్ళిళ్ళ వల్లనే… మీరు ఇవన్నీ చేయలేకపోయారా..? పవన్ కళ్యాణ్ కు నాలుగవ భార్య అయిన జగన్ రెడ్డి.. హారతి హస్బెండు అంటూ రాజశేఖర్ ఎద్దేవా చేసారు.