జగన్ రెడ్డి అభివృద్ధికి తక్కువ అవినీతికి ఎక్కువ..!

ఏలూరు, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి మరియు దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి విమర్శించారు. శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభంజనంతో ఐదు కోట్ల మంది ప్రజాభిమానం చూరగొని సంవత్సర కాలంగా, సుపరిపాలన అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కార్పోరేటర్ కీ ఎక్కువ ఎమ్.ఎల్.ఏ కి తక్కువ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన పులివెందుల పిల్లి, అవినీతి పుత్రుడు జగన్ రెడ్డి చేసిన చౌకబారు వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో పరిపాలనను గాలికి వదిలేసి, మద్యం కుంభకోణాలు, ఇసుక కమిషన్లతో రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న జగనాసురుడు, నేడు ఊకదంపుడు అబద్దాలు చెప్తే వినే పరిస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. అధికారం పోయి, ప్రతిపక్ష హోదా లేక, అసలు ఏమి చేయాలో తెలియక, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఇక జగన్ రెడ్డికి ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెర్త్ ఖాయంగా ఉందని రాష్ట్ర ప్రజలంతా చర్చిస్తున్నారన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం వైసీపీ తరఫున అభ్యర్థులను నిలపలేని దద్దమ్మ జగన్ రెడ్డి. ఇప్పటికైనా జనసేన పార్టీ పై, జనసేన నాయకులపై విమర్శలు మానుకోవాలని, నువ్వు అసెంబ్లీకి రానప్పుడు నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి సన్యాసం తీసుకోవాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు. జగన్ రెడ్డి చాలా రోజుల తరువాత బయటకు వచ్చి నేను కూడా బ్రతికే ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్ను గతంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించావు, కాబట్టే నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో జగన్ రెడ్డికి తప్ప ఎవరికి లేదన్నారు. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ప్రజలు జగన్కు 11 సీట్లే ఇచ్చిన, అతనిలో ఇంకా మార్పు రాలేదని, రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పిన వారు మారలేదన్నారు. జగన్ రెడ్డి జనసేన పై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇకనైనా జగన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. లేదంటే జనసైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, కలపాల ప్రేమ్ కుమార్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, మీడియా ఇంచార్జీ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment