ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చిన తర్వాతే జగన్ రెడ్డి పత్తికొండకు రావాలి

  • పత్తికొండ నియోజకవర్గంలో మీరిచ్చిన హామీలు ఏమి నెరవేర్చారని పత్తికొండకు వస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి..??
  • ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా డిసెంబర్ 2వ తారీఖున 2017 సంవత్సరం మీరు మా పత్తికొండకు వచ్చి ఇచ్చిన వంటి హామీలు ఒకటైనా అమలు చేశారా మీరు..??
  • మీరు రావాల్సింది రైతు భరోసా బటన్ నొక్కడానికి కాదు రైతులకు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు త్రాగునీరు, సాగునీరు, గ్రామాలలో అభివృద్ధి కల్పించడానికి రావాలి, పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ది శూన్యం

పత్తికొండ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వవహించడం జరిగింది. ఈ సమావేశంలో పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీజి రాజశేఖర్ మాట్లాడుతూ అయ్యా సీఎం మా పత్తికొండ నియోజకవర్గం అత్యధికంగా వెనకబడిన నియోజకవర్గం. మా నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో ఒక్కో సమస్య ఉంది, మీకు చేతనైతే గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరు అందించండి రైతులు సంతోషపడతారు, ఆనందిస్తారు. నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించండ, యువతకి ఉపాధి దొరుకుతుంది. అంతేకానీ మీరు మా పత్తికొండకు రావాల్సిందే. రైతు భరోసా బటన్ నొక్కడడానికి కాదు, మీరు మా పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే పత్తికొండకు రావాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారు, ఇంతవరకు ఎందుకు చేయలేదు?. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు మీరు ఏ ఒక్క మండలంలోనైనా ఒక్క కోల్డ్ స్టోరేజ్ అయిన ఏర్పాటు చేశారా?.. చెరువులకు పిల్ల కాలువలు ద్వారా నీరు ఇస్తాం అన్నారు మీరు ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడ ఎక్కడ అందించారో చెప్పాలి?. పింఛన్ వయసు 45 సంవత్సరాలకే తగ్గించి పింఛన్ మంజూరు చేస్తామన్నారు, మీరు ఎందుకు మాట నిలబెట్టుకోలేకపోయారు?. మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి మధ్యలో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు అన్నారు, ఇంతవరకు ఎక్కడ ఏర్పాటు చేశారు?. మా పత్తికొండ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల లేదు, ఇంతవరకు శంకుస్థాపన కూడా చేయలేదు? సంవత్సరానికి 2000 మంది పైగా విద్యార్థులు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నికల్ చేయాలంటే అందుబాటులో లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కావున మీరు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చిన తర్వాత మా పత్తికొండకు రావాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు, కావున జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ తరపున గుర్తు చేస్తున్నాం, మాకు మా పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చెందడమే మా ప్రధాన లక్ష్యం. కావున అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారూ మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో మీరు ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు అందరిని తెలుసుకున్నారు, కానీ ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు, కావున మీరు మా పత్తికొండ నియోజకవర్గం వచ్చే అర్హత మీకు లేదని మా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావున మీరిచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే మా పత్తికొండలో అడుగు పెట్టాలని జనసేన పార్టీ తరఫున రాజశేఖర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, నూర్ భాషా, వడ్డే వీరేష్, ధనంజయ, శేఖర్, హోసూరు వీరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.