గుంటూరు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై బుధవారం అకారణంగా జగన్ రెడ్డి పేలిన తప్పుడు కూతలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు యర్రగోపుల జయదీప్ తెలిపారు. పేపరులో స్ర్కిప్ట్ చూడకుండా చదవలేని ఈ జగన్ రెడ్డి ఒక నీటీ సంఘం చైర్మన్ కి తక్కవ…పంచాయతీ వార్డు మెంబరుకి ఎక్కువ అని విమర్శించారు. ఎన్డీఏ కూటమి దెబ్బకు కుదేలై 11 సీట్లకు పరిమితమైన జగన్ రెడ్డి బతుకు చించిన విస్తరిలా తయారైన నేపథ్యంలో తన అక్కసును నిరంతరం పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పై వెళ్లగక్కుతున్న విషయం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి నోటీని అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికలలో ఒక్క సీటు లేకుండా ఇంటికే పరిమితం చేస్తారని వెల్లడించారు. నీలాగా కమీషన్లకి కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్ ఏరోజూ కార్పోరేట్ రాజకీయాలు చేయడం లేదని, నీ పార్టీ తరపున గెలిచిన కార్పోరేటర్లు,ఎమ్మెల్సీలు,ఎంపీలు నీ సైకోనైజాన్ని చూసి బరించలేక జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పదవి,జీతం పోతుందని అసెంబ్లీకి పరుగుపెట్టిన ఈ జగన్ రెడ్డి ఇక మాజీ ముఖ్యమంత్రిగానే జీవితకాలం మిగిలిపోతాడని దుయ్యబట్టారు.
Share this content:
Post Comment