జగన్ రెడ్డి.. పిచ్చి ప్రేలాపన మానుకో: గురాన అయ్యలు

విజయనగరం, వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపన మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జనసేన నేతలు గురాన అయ్యలు, ఆదాడమోహన్ రావులు హెచ్చరించారు. గురువారం గురాన అయ్యలు కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ జనసేన జెండా మోసి గెలుపు కోసం కృషిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికి పండగలా పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యాలను ఈ సందర్భంగా ఖండించారు. వైఎస్ జగన్ మతిస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లే రావడంతో జగన్ మతిస్థిమితం కోల్పోయారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, జగన్‌కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసమైనా శాసన సభకు వచ్చి మాట్లాడలేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మారకుంటే తీవ్రస్థాయిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. జగన్ ఇంటిని ముట్టిడించే పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-06-at-6.05.07-PM-1024x473 జగన్ రెడ్డి.. పిచ్చి ప్రేలాపన మానుకో: గురాన అయ్యలు

Share this content:

Post Comment