వైసిపి పార్టీ అనధికారిక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే, ఇప్పుడు మీరు మీ పార్టీ ఉన్న దయనీయమైన పరిస్థితి కంటే మరింత దారుణమైన స్థితికి చేరుకోవాల్సి వస్తుందని, మీరు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీలు దౌర్జన్యాలుపై ఎక్కువ, రాష్ట్ర అభివృద్ధిపై తక్కువ ద్రృష్టి పెట్టారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని ఛీ కొట్టి మూల కూర్చోబెట్టారని, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ పై అనుచితంగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మరింత చీదరించుకోవాల్సి వస్తుందని జనసేన నాయకులు బాబు పాలూరు వైసిపి అనధికారిక అధ్యక్షుడు జగన్ రెడ్డికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జాని, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శులు గార గౌరీ శంకర్, గంట్యేడ స్వామి నాయుడు, పెంట శంకర్ రావు, బలిజిపేట మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, బొబ్బిలి జనసేన నాయకులు బెవర గణేష్, కనకాల శ్యామ్, చీమల సతీష్, దిబ్బ కళ్యాణ్, చింతాడ అనంత్, సూర్యనారాయణ, పైల ప్రసాద రావు, కర్రి మణికంఠ, జగదీష్, వీరమహిళలు గైనెడి రమ్య, భద్రగిరి సత్య తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment