ఉదయగిరి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడటం సహేతుకం కాదని, గురివింద గింజ సామెతలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, వింజమూరు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఎస్.కె సుభాని ఘాటుగా విమర్శించారు. అయన మాట్లాడుతు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని సంబోధించడం తన వ్యక్తిత్వని గుర్తు చేస్తుందని విమర్చించారు. ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన నీవు కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోని నీ పార్టీ ఉప ముఖ్యమంత్రిని తక్కువ చేసి మాట్లాడటం భావ్యం కాదని, ప్రస్తుతం నీ స్థాయి ఏమిటో గుర్తు చేసుకుని మాట్లాడాలని ఎస్.కె సుభాని పేర్కొన్నారు. హోదాలు, స్థాయి, విలువలు ఏలాంటివో ఒక్కసారి గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటుందని ఎస్.కె సుభాని చురకలు అంటించారు.
Share this content:
Post Comment