జ‌గ‌న్ ఇదే నా మీ సంస్కారం.. గురాన అయ్యలు

విజయనగరం: ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌తంగా అత్యంత నీచ‌మైన స్థాయికి దిగ‌జారి మాట్లాడితే ఎలా అని జనసేన నేత గురాన అయ్యలు ప్ర‌శ్నించారు. గురువారం జీఎస్ఆర్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై జగన్‌ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? మీపై, మీ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారా ? అని జగన్ ని ప్రశ్నించారు. జ‌కీయాల‌లో అధికారం, విప‌క్షం అంటూ ఉండ‌డం స‌హ‌జ‌మేన‌ని దానిని గౌర‌వ ప్ర‌దంగా తీసుకోవాలే త‌ప్పా ఇలా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికి వచ్చిన్నట్లు ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెపితే బాగుండేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 6093 ఖైదీలు కాగలరు కానీ.. సత్యా నాదెళ్లలు కాలేరని అన్నారు. నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభద్రత భావన ఉండటం వల్లనే తమ అధినేత పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. కుంటి సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడిస్తేనే రాష్ట్రాభివృద్ది సాధ్యపడుతుందన్నారు.. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగిన జగన్. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. డబ్బు సంపాదనే ధేయ్యంగా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.. ఈ సమావేశంలో పార్టీ నాయకులు డి.రామచంద్రరాజు, డి.రాజేంద్రప్రసాద్, సుంకరి అప్పారావు, రామకృష్ణ (బాలు), చక్రవర్తి, వంక నర్సింగరావు, వెంకటేష్, పిడుగు సతీష్, రాజేష్, నవీన్ కుమార్, పవన్ కుమార్, సురేష్, భార్గవ్ తదితరులు పాల్గోన్నారు.