పరాకాష్టకు చేరిన జగన్ పిచ్చి..!: అంకె ఈశ్వరయ్య

రాప్తాడులో జరిగే సిద్ధం సభ కోసం ఉమ్మిడి అనంతపురం జిల్లాలలో ప్రజాదరణ కరువై పక్కనే ఉన్న కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుండి జన సమీకరణ చేస్తున్నారు. ప్రజాధనాన్ని సభల పేరుతో అడ్డగోలుగా ఖర్చు పెడుతూ రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని నేడుతున్నారు. మీ స్వలాభం కోసం మరోసారి ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధం సభల ద్వారా ఎన్నికలకు సామాయాప్తమవుతున్నారు. దీనిలో భాగంగా ఇష్టం వచ్చినట్లు పిచ్చి పట్టిన సైకో లాగా రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారులను కూడా దిగ్బంధం చేసి 10 కిలోమీటర్ల దూర ప్రయానాన్ని వంద కిలోమీటర్లు తిరిగి వచ్చేలా రహదారి మల్లింపుల ద్వారా వాహనదారులు సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఒక కిలోమీటర్ దూరం ప్రయారించాలన్న హెలికాప్టర్ ఉపయోగించే జగన్ రెడ్డికి రోడ్డుపై ప్రయాణించే సామాన్య ప్రజల కష్టాలు తెలుస్తాయా అని అంకె ఈశ్వరయ్య మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన చందంగా పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో విసిగి పోయిన ప్రజలు జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి కూడా సంసిద్ధమై ఉన్నారని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఘాటుగా హెచ్చరించడం జరిగింది.