జగనన్న కాలనీలు రాష్ట్రంలోనే పెద్ద స్కాం

• ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం
• గతం నిర్వహించిన #ఘూదంఒర్నింగ్_ఛంశిర్ తరహాలోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు
• జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన ఆన్యాయం జరుగుతుంది
• #JaganannaMosam హ్యాష్‌ ట్యాగ్‌తో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయండి
• జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్‌

పశ్చిమ నియోజకవర్గ జగనన్న కాలనీలు రాష్ట్రంలోనే పెద్ద స్కాం అని స్థానిక పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్‌ అన్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన ఆన్యాయం జరుగుతుందన్నారు. #ఝగనన్నంఒసం హ్యాష్‌ ట్యాగ్‌తో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2-12-20 న ఇచ్చిన జీవో నెంబర్ 9 లో నవరత్నాల కింద పేదలందరికీ ఇళ్లు అని చెప్పారని, 28.30 లక్షల మందికి ఇళ్లు నిర్మాణం, మొదటి దశలో 15.10లక్షల మందికి అని ప్రకటించుకున్నారని, జూన్ 2022 మొదటి దశ, 2023జూన్ కి రెండో దశ పూర్తి చేస్తామని చెప్పుకున్నారని, పవన్ కళ్యాణ్ సోషల్ ఆడిట్ కార్యక్రమం ప్రకటించగానే వైయస్ నేతల్లో భయం పట్టుకుందని, నిన్న సజ్జల, జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలు చెబుతున్నారని,17వేల కాలనీలు అని చెప్పుకుంటున్న వైసీపీనేతలు కనీసం 17 కాలనీలుఅయినా పూర్తి చేశారని ? పేదలందరికీ 28లక్షల ఇళ్ళ నిర్మాణం అని చెప్పింది వాస్తవం కాదా? అని, నిన్న సజ్జల, మంత్రులు 21.25లక్షల ఇళ్లే కడుతున్నట్లు చెప్పారని, మరి ఈ ఏడు లక్షల ఇళ్లు ఏమయ్యాయో ఎవరు సమాధానం చెబుతారని, ఆ ఇళ్లు ఎటు వెళ్లాయి, ఎవరు మింగేశారో వాస్తవాలు బయట పెట్టాలని, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పేందుకే జనసేన సోషల్ ఆడిట్ చేపడుతుందని, గడపగడపకూ వెళ్లే ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు కూడా నిలదీయాలని, జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున స్కాం జరిగిందనేది వాస్తవమని, ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిన పధకం ఇదేఅని, భూముల కొనుగోళ్లల్లో ఎకరానికి పది నుంచి ఇరవై లక్షలు పెంచి జగన్ అండ్‌ కో పది కోట్లు దోచుకున్నది వాస్తవమా కాదో సమాధానం చెప్పాలని, స్థలాలను చదను చేస్తామని చెప్పి నాలుగు వేల కోట్లు దోచుకుంది వాస్తవంమని, మౌళిక సదుపాయాలకోసం 34వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారని ఒక పైపు లైన్ వేశారా, కరెంటు స్తంభం వేశారా.. కనీస వసతులు కల్పించారని, ఇవేమీ ఎక్కడా కనిపించడం లేదని మరి 34వేల కోట్లు ఎక్కడకి వెళ్లాయి సమాధానం చెప్పాలని, 2019 ముందు సిమెంట్ బస్తా ధర 190 ఉంటే.. 450 చేశారని, భారతి సిమెంట్ మాత్రమే జగనన్న కాలనీల నిర్మాణాలకు వాడుతున్నారని, సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసి, బస్తాకు యాభై రూపాయలు చొప్పున పది వేల కోట్లు జగన్ కి ఇచ్చారని, మొత్తం మీద జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో యాభై వేల కోట్లు దోచేశారని, ఇంటి నిర్మాణం కోసం లక్షా యనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, 14లక్షలపై చిలుకు ఇళ్ల కోసం కేంద్రం అనుమతి మంజూరు చేసిందని, అయినా అడ్డగోలుగా పేదల సొమ్మును జగన్ అండ్ దోచుకున్నారని, జగనన్న కాలనీలు పేరుతో స్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలను అప్పులు ఊబిలోకి నెట్టేసే ప్రయత్నమే అని, జనసేన చేపట్టిన సోషల్ఆడిట్ లో వారి అవినీతి బాగోతం బయట పడుతుందనే కంగారు పడుతున్నారని, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు సజ్జల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలవరకు క్యూలు కడుతున్నారని, ఉద్యోగులు, వ్యాపారుల ఆదాయం పడిపోయిందని, జగన్ అండ్ కో ఆదాయం పదింతలు అయ్యిందని, ప్రజలు కూడా గుడ్డిగా నమ్మడం కాదు. వాస్తవాలు ఆలోచించి జగన్ కి బుద్ది చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్ రావు, ఎస్ రాము గుప్తా, కొరగంజి వెంకటరమణ, షేక్ అమీర్ భాష, ఎన్.ప్రదీప్ రాజ్, జల్లి రమేష్, రెడ్డిపల్లి గంగాధర్, ఏలూరు సాయి శరత్, సోమి గోవింద్, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, నగర కమిటీ సభ్యులు సయ్యద్ మొబిన, బొట్టా సాయికుమార్ గన్ను శంకర్, ఎస్ నరేష్, వసంత కుమార్, ఎ.విజయ్ కుమారి, అమ్మవారి ధార్మిక మండలసభ్యులు బద్దన ప్రసాద్, ఆర్ రమాదేవి, రాళ్లపూడి గోవింద్, జనసేన నాయకులు రాజేష్, రాజా నాయుడు, పి. శివ, బావిశెట్టి శ్రీను సామి మహేష్, తదితరులు పాల్గొన్నారు.