పోలవరం జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

పోలవరం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రకటించినటువంటి జగనన్న ఇల్లు పథకంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావుల ఆదేశాల మేరకు శనివారం జీలుగుమిల్లి మండలం పాలచర్ల గ్రామంలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు మరియు జనసైనికులు కార్యకర్తలు నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ అధికారులకు వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిరుపేదల కోసం కేటాయిస్తున్నటువంటి జగనన్న ఇల్లు పథకంలో ఇల్లు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదని, 89 వేల కోట్లు కేటాయించాము అని చేప్పుకోవడమే గాని ఎక్కడ ఇల్లు కట్టిన దాఖలాలు లేవని,భూములను అధికార నాయకులు అమ్ముకుంటున్నారని, ఇచ్చిన భూములు వర్షాకాలంలో నదుల వలే తలపిస్తున్నాయని, ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ సమస్యను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపే విధంగా చర్యలు తీసుకుంటామని, నిరుపేదలకు ఇల్లు, వైద్యం, విద్యా, త్రాగునీరు అందాలంటే జనసేన అధికారంలోకి వస్తే మాత్రమే అవుతుందని, ఈ చేతకాని వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోలా మధు, కర్రీ మహేష్, జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.