ఆచరణ కాని హామీలతో ప్రజల్ని వంచిస్తున్న జగనన్న

మైలవరం, ఆచరణ కాని హామీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు(గాంధీ) ఆరోపించారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న మోసం-జగనన్న ఇల్లు పెడలందరికి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా, పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో 12, 13, 14 వ తేదీలలో జగనన్న కాలనీలలో పర్యటించడం జరుగుతుందన్నారు. మౌళిక సదుపాయాల గురించి ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇస్తామన్నారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జనసేన ప్రభుత్వాన్ని నిలదీస్తుందని అన్నారు. గత జూన్ లో ముఖ్యమంత్రి జగనన్న పులివెందుల, కాకినాడ, విజయనగరంలో పర్యటన సందర్భంగా జగనన్న కాలనీలు శంఖుస్థాపన చేసి ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు కట్టిస్తామని ప్రజలకు వాగ్దానం చేసి తొలివిడతగా 2022 జూలై కల్లా పద్దెనిమిది లక్షల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వాగ్దానం చేసి ప్రజలను మోసం చేసారని ఆరోపించారు. హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తయిన కూడా నేటి వరకు కేవలం లక్షా ఇరవై వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మాట తప్పారని విమర్శించారు. జగనన్న కాలనీలలో పర్యటనలో భాగంగా ప్రభుత్వం చేస్తూన్న మోసాన్ని ప్రజల ముందు ఎండగడతామని అన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ మైలవరం, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, పోలిశెట్టి తేజ, చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, నాయకులు భూక్య చిరంజీవి, మాదాస్ సుబ్బారావు, బత్తిన శ్రీనివాసరావు, తోట క్రాంతి బాబు, పౌల్ రాజ్, మాదినేని చిన్న రామారావు, పసుపులేటి నాగరాజు, జనసైనికులు పాండు, మర్రి కొండలరావు, యతిరాజు ప్రవీణ్, శీలం బాలకృష్ణ, వద్ది గోపీచంద్, ఐటీ వింగ్ నాగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.