గన్ను కంటే ముందు వచ్చే జగనన్న- మీరు ఎక్కడ?

  • హోమ్ మినిస్టర్ వనిత గారు అనంతపురం నియోజకవర్గంలో మైనర్ బాలికపై జరిగిన అకృత్యం మీ దృష్టికి ఇంకా రాలేదా?
  • మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు మీరు ఎక్కడున్నారు తల్లి? ఇంకా నిద్ర లేవలేదా?
  • అనంతపురం జిల్లాకు చెందిన శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ గారు మీరు ఎక్కడ ఉన్నారు తల్లి? ఏం చేస్తున్నారు?

అనంతపురం: నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు కష్టం వస్తే స్పందించే హృదయం లేని మీలాంటి వాళ్లందరికీ మంత్రి పదవులు ఎందుకు? మైనర్ బాలికని హింసిచ్చి, వేధిస్తే స్పందించలేని అధికారం మీకు ఎందుకు? అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంఘాలు, విపక్షాలు, మైనార్టీ సోదరులు గత వారం రోజులుగా నిస్సహాయ స్థితిలో ఉన్న, బాధిత బాలిక పక్షాన పోరాడుతుంటే.. విధి లేని పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి స్పందించి బాధిత బాలికను పరామర్శించడం.. ధైర్య, సాహసంతో కూడుకున్న చర్యగా మేము అభినందిస్తున్నాం. నామ మాత్రపు అరెస్టులతో సరి పెడితే సహించం.. దాస్టికానికి పాల్పడిన ఏపీపీ దంపతులను పదవుల నుంచి తక్షణమే తొలగించాలి. ఘోర అఘాయిత్యానికి కారుకులైన వారి అందరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
అఖిలపక్షం ఆధ్వర్యంలో బాధిత బాలికకు న్యాయం జరగాలని, బాలిక పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకు, అఖిలపక్ష నాయకులకు మరియు మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు మరియు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, సిపిఎం శ్రీ రామిరెడ్డి, టిడిపి నాయకులు ముక్తార్, జే.ఎం. భాష, ప్రజాసంఘ నాయకులు జాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎండి.ఇమామ్, ప్రజాబలం నాయకులు నజీమ్ భాష, ఏఐఎంఐఎం షేక్ దాదాపీరా, మెగా శ్యామ్, ఎస్ ఎం ఎం డి ఎస్ మసూద్, రఫీ, ప్రజాసంఘాల మహిళా నాయకురాలు శ్రీమతి శ్యామల, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, శ్రీమతి జయమ్మ, అవుకు విజయ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, రొల్ల భాస్కర్, హుస్సేన్, దరాజ్ భాషా, కే.ఎల్.ఎస్ చోటు నగర కార్యదర్శులు లాల్ స్వామి, కుమ్మర మురళి, అంజి, సంపత్, ఆకుల అశోక్, వీరమహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి దాసరి సరిత, టిడిపి మహిళా నాయకురాలు, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, మరియు నాయకులు చిరు, సల్మాన్, విజయ్ దేవరయల్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.