గన్నుకంటే ముందు వచ్చే జగనన్న- మీరు ఎక్కడ?

  • హోమ్ మినిస్టర్ వనిత గారు అనంతపురం నియోజకవర్గంలో మైనర్ బాలికపై జరిగిన అకృత్యం మీ దృష్టికి ఇంకా రాలేదా?
  • మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు మీరు ఎక్కడున్నారు తల్లి? ఇంకా నిద్ర లేవలేదా?
  • అనంతపురం జిల్లాకు చెందిన శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ గారు మీరు ఎక్కడ ఉన్నారు తల్లి? ఏం చేస్తున్నారు?
  • నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు కష్టం వస్తే స్పందించే హృదయం లేని మీలాంటి వాళ్లందరికీ మంత్రి పదవులు ఎందుకు? మైనర్ బాలికని హింసిచ్చి, వేధిస్తే స్పందించలేని.. అధికారం మీకు ఎందుకు?

దెందులూరు: ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ నియోజక వర్గంలో 14 సంవత్సరాల అభం శుభం తెలియని బాలికను అనంతపురం జిల్లా ఉరవకొండ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వర్తిస్తున్న వసంతలక్ష్మి ఆమె భర్త వారి ఇంట్లో పని చేసేందుకు బాలికను పనికి కుదుర్చుకొని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై స్పందించిన దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంఘాలు, విపక్షాలు, మైనార్టీ సోదరులు గత వారం రోజులుగా నిస్సహాయ స్థితిలో ఉన్న, బాధిత బాలిక పక్షాన పోరాడుతుంటే..విధి లేని పరిస్థితుల్లో వారం రోజుల తర్వాత అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి స్పందించి బాధిత బాలికను పరామర్శించడం ధైర్య, సాహసంతో కూడుకున్న చర్యగా మేము అభినందిస్తున్నాం. నామ మాత్రపు అరెస్టులతో సరి పెడితే సహించం.. దాస్టికానికి పాల్పడిన ఏపీపీ దంపతులను పదవుల నుంచి తక్షణమే తొలగించాలి. ఘోర అఘాయిత్యానికి కారుకులైన వారందరికీ కటిన శిక్షలు వెయ్యాలని వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు.