జగనన్న కాలనీలతో సాకారం కాని పేదల సొంతింటి కల

  • ప్రచార ఆర్భాటాలే కాని ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు..
  • జగన్ రెడ్డి జూన్ 2021 పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు 2022 నవంబర్ వచ్చిన ఇంకా చాలా వరకు పునాధులకే నోచుకొని జగనన్న కాలనిలు..
  • పేదలకు న్యాయం జరిగేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాం…
  • జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్

పత్తికొండ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆదివారం #JaganannaMosam 13-11-2022 న మద్దికేర మండల కేంద్రం, మద్దికేర గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగన్నన కాలనీలు.. పేద ప్రజల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ మద్దికేర మండల నాయకులు గద్దల రాజు, వడ్ల కంబగిరి, వడ్ల నరేష్, సొంపల్లి అశోక్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సి.జి రాజశేఖర్ మద్దికేర గ్రామంలోని జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.జి రాజశేఖర్ కాలినీలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. లబ్ధిదారులు వారి సమస్యలను వివరిస్తూ….మాకు కేటాయించిన ఇళ్ళ స్థలాల భూములు ఇళ్ళ నిర్మాణానికి తగ్గ భూములు కావని, ఇంతకముందు ఇక్కడ వాగు, వంకలు పారిన భూములు అని, ఇక్కడ పునాదులను తీస్తే నీరు ఊరుతునాయి అని, ప్రభుత్వం ఇచ్చే 1.80 వేల రూపాయలు కేవలం పునాదులను పుడ్చటానికి సరిపోతుంది అని, అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు, వైకాపా ప్రజాప్రతినిధులు వత్తిడి తో మేము కష్టపడిన డబ్బులను పునాదులు పుడ్చటానికీ మాత్రమే పెడ్తునాం, బుడిదిలో పోసిన పన్నీరు లా మా పరిస్థితి తయారయింది అని బాధ పడుతున్నారు. ప్రస్తుత ధరలు పెరిగిన పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చే లక్షా ఎనభై వేల రూపాయలు సరిపోవటం లేదని లబ్ధిదారుల సమస్యలను విన్న సి.జి రాజశేఖర్ మాట్లాడుతూ….. ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల జగనన్న కాలనీల పేరుతో ప్రజల కు కన్నీళ్లు మాత్రమే మిగులుస్తుందని. వారి సొంత ఇంటి కలను కలగానే మారుతున్నాయని తెలియజేశారు. ఇక్కడ పూర్తిగా వాగు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, జగనన్న కాలనీలో అనేకచోట్ల బేస్ మట్టాలు చీలిపోయిన దృశ్యాలు చూసాం, ఇక్కడ స్థానికులను అడగ్గా ఇక్కడ మాకు కనీసం, రవాణా సౌకర్యం లేదు, లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం మాకు సాధ్యం కాదని మాకు బేస్ మట్టంకే లక్ష రూపాయలు పైగా ఖర్చు అవుతుందని, ఇల్లు ఎప్పుడు నిర్మించాలని తెలియజేశారు, ఒక ఇల్లు నిర్మించడానికి మినిమం ఎనిమిది లక్షలు అవుతుందని ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే మేము ఏ విధంగా ఇల్లు నిర్మించుకుంటామని తెలిపారు, ఇంకా అనేక చోట్ల ఇల్లు నిర్మాణాలు కూడా చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అని అడగగా ఇక్కడ వాగు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం అంటే మా ప్రాణాలను మేము తెగించుకున్నట్లు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బంక మట్టి ఉన్నందువల్ల బేస్ మట్టం పది అడుగులు పైగా తీయాలి, లేదంటే ఇల్లు కూలిపోయే అవకాశం ఉన్నందువల్ల నిర్మించుకోలేకపోతున్నారు అని తెలియజేశారు, పది అడుగులు తీసి ఇల్లు నిర్మించుకుంటే బేస్ మట్టానికి రెండు లక్షల పైగా ఖర్చు అవుతుందని తెలిపారు, మీరు అధైర్యపడకండి మీకు జనసేన పార్టీ అండగా ఉండి మీకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని లబ్ధిదారులకు ధైర్యం చెప్పారు. గద్దల రాజు మాట్లాడుతూ….. మద్దికేరలో ఎస్సీ కాలనీ వైపు కేటాయించిన 208 ఇళ్ల స్థలాలలో చాలా భాగం ఇళ్ళ నిర్మాణానికి సౌకర్యవంతం కానీ, నాణ్యత లోపం గల భూములలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించడం చాలా అన్యాయమని. కేవలం ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిడితో మాత్రమే లబ్ధిదారులు ఈ స్థలాలలో ఇల్లు కట్టుకుంటున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా సోంపల్లి అశోక్ మాట్లాడుతూ……. ఇంతకుముందు వాగులు, వంకలు పారిన భూముల్లో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇల్లు నిర్మించుకోవడానికి అసౌకర్యంగా ఉండటం, పునాదులు తీస్తే నీరు ఊరడం, కాబట్టి ఇటువంటి ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు కేటాయించకుండా, వారికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు బాషా, ఆది, లింగరాజు, అంజి, యుగంధర్, కాసిమ్ తదితరాలు పాల్గొన్నారు.