చెరువులను తలపిస్తున్న జగనన్న ఇల్లు, ఇళ్ల స్థలాలు

గుడ్లూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు రియాజ్ మరియు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పులి మల్లికార్జున రావు గారి ఆదేశం మేరకు గుడ్లూరు గ్రామ పరిధిలోని గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎం.ఎస్.ఆర్ సంఘం. ఈ సంఘానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒకటిన్నర సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీద ఇచ్చిన ఇళ్ల స్థలాలు పరిస్థితి చూస్తే ఒక చెరువు లాగా స్మశాన వాటిక లాగా దర్శనమిస్తున్నాయి. 30 లక్షల జగనన్న ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం లక్షపై చిలుకు ఇళ్లను పూర్తి చేయడం సిగ్గుచేటు. మాట తప్పని మడిమ తిప్పని రాజన్న వారసుని రాక్షస పాలన త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని అదేవిధంగా కాలనీలో నాడు నేడు క్రింద ఉన్నటువంటి మర్రిచెట్టు బడిని హైస్కూల్లో విలీనం చేయడం ద్వారా రాకపోకులకు సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉండడం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు స్పందించి ఈ యొక్క కాలనీని అభివృద్ధి చేసి సమస్యలను పరిష్కరించాలని గుడ్లూరు మండల జనసేన పార్టీ తరపున అన్నంగి చలపతి గారు తెలియజేశారు. ప్రజల భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి జనసేనతోనే సాధ్యం.