విడివాడ ఆధ్వర్యంలో మూడవరోజు జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు

తణుకు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదవారికి కన్నీళ్లు మరియు జగనన్న మోసం అనే కార్యక్రమంలో మూడవరోజు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం అర్జునుడు పాలెం గ్రామంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పరిశీలించడం జరిగింది ఈ జగనన్న ఇళ్లకు సరైన రహదారి గానీ డ్రైనేజీ సదుపాయము గాని మంచినీరు సదుపాయం గానీ ఎలక్ట్రిసిటీ సదుపాయం గాని లేవని లబ్ధిదారులు విడువాడ రామచంద్రరావు దగ్గర వాపోయారు మరియు తూర్పు విప్పర్రు కేకుముందువల్లి గ్రామాల్లోని జగనన్న ఇల్లులు సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కట్నం కట్నం విశాలి అర్జునుడు పాలెం సర్పంచ్ పోతుల గంగాధర్ తూర్పు విప్పర్రు సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ ఎంపీటీసీ నరసింహమూర్తి కే, కుముదువల్లి ఎంపీటీసీ పిండి గోవింద్, ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశీ, తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు మండలం ఉపాధ్యక్షురాలు తెలగరెడ్డి లక్ష్మి, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ తులసీరామ్ మరియు పంతం నానాజీ, కేశవ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.