టెక్కలి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదల పాలిటి కన్నీళ్లు

టెక్కలి నియోజకవర్గం: జగనన్న ఇళ్ళు -పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాలి మండలం కురుడు పంచాయతీ పరిధిలో పరిశీలించిన జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గం నాయకులు మేదిబోయిన సుధీర్, పల్లి కోటేశ్వరరావు అధ్వర్యంలో కొండ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో లబ్ది దారులు ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు అని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నలుగురు, ఐదుగురు వెక్తులతో శీతల గదుల్లో తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు. నివాసయోగ్యం లేని, మౌలిక సదుపాయాలు లేని కొండ ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ… రాష్ట్ర ప్రజలను అప్పుల ఉబిలో నెట్టుతున్నారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియజకవర్గం టెక్కలి నాయకులు సంతోష్, వినోద్, రమేష్, చందు, ప్రసాద్, జనార్థన్, శ్రీను పట్నాయక్, ఉదయ్, పవన్, జనసైనికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.